“కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు”
“విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్”
“మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం”
“మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది మనం పరిశుద్ధులమైతే ఈలోకం పరిశుద్ధమవుతుంది”
“శక్తి మొత్తం మీలోనే ఉంది, మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు”
“ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి”
“తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు”
“ఏ తప్పూ చేయనివారు ఎవరికీ భయపడరు”
“ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి”
“అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే”
“మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం”
“కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు”
“జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనస్సు ప్రధానం”
“వేలకొద్ది నీతులు బోధించే కన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపు”
“ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడమే అసలైన జ్ఞానానికి చిహ్నం”
“ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు”
“అశ్రద్ధ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది”
“మీరు ఏదైనా పని చేస్తున్నపుడు దాని తరువాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు, దానిని ఒక అత్యుత్తమమైన ఆరాధనగా చెయ్యండి, ఆ పని చేస్తున్నంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి”
“ఇతరుల ఆలోచనా విధానం కార్యనిర్వహణల్లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు, దానికి బదులు వాటిలో పరిణితి పొందే మార్గాలను వెతికి తెలియజేయండి”
“ఆదర్శపరుడు ఒక వేయి తప్పులు చేస్తే ఆదర్శరహితుడు ఏభై వేల తప్పులు చేస్తాడనటం నిస్సంసయం, కాబట్టి ఆదర్శాన్ని కలిగి ఉండడం మంచిది”
“తప్పును సరిదిద్దకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది”
“నిజాన్ని వెయ్యి వేర్వేరు మార్గాల్లో పేర్కొనవచ్చు, అయితే ప్రతి ఒక్కటి నిజం”
“ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేము, అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధింపబడుతాయి, కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి”
“మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి”
“భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి”
“కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన, కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి, రేయింబవళ్ళు వాటినే స్మరించండి, అప్పుడే అద్భుతాలను సాధించగలరు”
“లేవండి ! మేల్కోండి ! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి”
“వీరులు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించేవరకూ పోరాటం చేస్తారు”
“చావు బ్రతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది”
“జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే”
“పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం, అవే జీవితానికి మెరుగులు దిద్దేవి, ఓటములే లేని జీవితం ఉంటుందా”
“మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే”
“ఈ ప్రపంచమనేది ఒక బ్రహ్మాండమైన వ్యాయామశాల, ఇక్కడ మనందరమూ వ్యాయామం చేసి శారీరకంగా, నైతికంగా, మానసికంగా, ఆపైన ఆధ్యాత్మికంగా మరింత బలవంతులుగా కావాలి”
“మానవుడు ఎంత గొప్పవాడైతే, అంత కఠినమైన పరీక్షలను దాటవలసి వుంటుంది”
“సమస్యలొస్తే రానీ… సవాళ్ళు ఎదురవుతే ఎదురవనీ… ఓటమి తలుపు తడితే తట్టనీ… నిలుద్దాం … పోరాడదాం …. గెలుద్దాం”
“సుఖం, దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది సుఖానికి స్వాగతం చెప్పేవాడు
దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే”
“అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది, సిద్ధితో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ మరియు ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి”
“నిన్నటి గురించి మధనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే”
“మనచుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు, అవి ఎన్నటికీ ఒకేలా ఉంటాయి వాటిలో మనం తెచ్చిన మార్పు ద్వారానే మనమే పరిణితి పొందుతాం”
“మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు, ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు”
“చెలిమిని మించిన కలిమి లేదు.. సంతృప్తిని మించిన బలిమి లేదు”
“దయార్ద్ర హృదయంతో ఇతరులకు మేలు చేయడం మంచిదే కానీ సర్వ జీవులను భగవత్ స్వరూపలుగా భావించి సేవ చేయడం ఇంకా మంచిది”
“జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు ఈ వలలో అనంతకాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు”
“మొదట మన లక్ష్యాలను అర్ధం చేసుకోవాలి.. తరువాత వాటిని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి”
“భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు, దేనినీ సాధించలేడు, సత్యమని, మంచిదని నీవు అర్ధం చేసుకున్నదానిని తక్షణమే ఆచరించు”
“పవిత్రంగా ఉండటం, ఇతరులకు మంచి చేయటమే మతం యొక్క సారాంశం”
“విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ.. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును ….. లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి….. మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం.. సార్ధకత”
“విజయానికి తొలి మెట్టు మనపై మనకు విశ్వాసం ఉండడమే”
“ఒక ధ్యేయంతో కృషి చేస్తే, నేడు కాకపోయినా రేపయినా విజయం తప్పదు”
“ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి.. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి.. దాన్నే కలగనండి.. దాన్నే శ్వాసించండి.. ఇదే విజయానికి మార్గం”
“గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడూ అపయకరి కాదు మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యమే”
“ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు, పిరికివాడు క్షణ క్షణం మరణిస్తాడు”
“నీ వెనుక ఏముంది…. ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం”
“మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు”
“ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్ధుడవని భావించకు.. నీవు ఏమైనా చేయగలవు..అన్నింటినీ సాధించగలవు”
“అధికార వాంఛ, అసూయ ఈ రెండు విషయాల గురించి జాగ్రత్త వహించండి, ఇవే నాశనానికి మూలకారణాలు”
“తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు,కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు, ఏ పని అల్పమైనది కాదు”
“ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది, లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది”
“ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధించగలం”
“సామాన్య జనంలోకి ఎంతగా చదువు సంధ్యలు జొచ్చుకొనిపోతాయో అంతగా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది”
“వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సుదుపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి”
“మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు, బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు, శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు”
“ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు”
“పోరాటంలోనైనా, మృత్యువులోనైనా, మీ శక్తినే విశ్వసించండి, ప్రపంచంలో పాపమనేది ఉంటే అది బలహీనత మాత్రమే, బలవంతులై ఉండండి, బలహీనతే పాపము, బలహీనతే మరణము”
“భయపడుతూ బతికేవారికి ఎప్పుడూ ఆపదలు వస్తుంటాయి”
“ధైర్యంగా ముందుకు సాగిపో ! ఎప్పుడూ అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండు, స్థైర్యంగా ఉండు, ఈర్ష్యను, స్వార్ధాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీవు ప్రపంచాన్నే కదిలించివేయగలవు”
“జీవితంలో భయంలేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలరు”
“విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు.. విజయమేమీ అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు”
“గుండె(మనసు)మరియు మెదడు మధ్య వివాదం లో మీ గుండెను (మనసును) అనుసరించండి”
“బలాఢ్యుడవై, ధైర్యశాలి వై నిలబడు. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవని తెలుసుకో”
“ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇవే విజయాన్నికాక్షించేవారి ప్రాధమిక లక్షణాలు”
“భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము, వివేకంతో చేసే పని సత్ఫలితాన్నిస్తుంది”
“లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని, లక్ష్య సాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యమంతా అదే”
“రోజులో ఒక్కసారైనా నీతో నీవు మాట్లాడుకో.. లేదంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని నీవు కోల్పోతావు”
“డబ్బులో శక్తి లేదు.. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది”
“అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు, చిత్తశుద్ధి ,ఓర్పు,పట్టుదల ఈ మూడూ కార్యసిద్ధికి ఆవస్యకాలు, కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా అత్యావశ్యకం”
“మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే”
“విద్య జీవితానికి వెలుగునిస్తుంది”
“సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది”
“పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది, ప్రేమ పూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు”
“విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకూడదు, వెంటనే ప్రారంభించాలి”
“విధేయతను మొదట అలవరచుకోండి, సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది”
“ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు”
“పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది”
“కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు, అనురాగం మన మాతృదేశపు సరిహద్దులను దాటితే మరెక్కడా కానరావు”
(పాశ్చాత్య మోజులో నేడు మన దేశంలో కూడా ఆప్యాయతకు బీటలు పడుతుండడం దురదృష్టాంశం)
“స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు”
“అతి నిరుపేద కూడా నీతి ప్రదర్శనలో గొప్పవాడిగా ఉండే ఘనత భారతీయులకే చెల్లుతుంది”
“మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసిందే, అందుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండి”
“నువ్వు నిరుపేదవని అనుకోవద్దు, ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి”
“మనలో ఉన్న పెద్దలోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేం, ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతుంటాడు, అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతుంది”
“మీ శరీరాన్ని గానీ, బుద్ధిని గానీ, బలహీనపరిచే దేన్నయినా విషం వలే తిరస్కరించండి”
“పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే,పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినపుడే ఆత్మ అతులిత శక్తిసంభరితమై బయటకు వస్తుంది”
“అందరికీ మేలు చేయండి.. అందరినీ ప్రేమించండి.. కానీ … ఎవరిపైనా వ్యామోహాన్ని పెంచుకోకండి”
“బలమే జీవనం.. బలహీనతే మరణం”
0 Comments